Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది
స్వర్గమహిమ భువిచేరే దివ్యపూజ ఇది
ఆత్మరూపియే రూపం దాల్చే పావన వేదికిది
మసిషికి జీవం నొసగే పరమ యాగమిది
రండీ రండీ దేవుని జనమా
అమరుని సేవకు అనురాగముతో
ఎదలను కడిగి ముదమున కదిలి
రాజులరాజుకు హారతులివ్వగా 2
1 వ చరణం..
ఇది జీవం ఆకృతి దాల్చే శుభసమయం
ఇది ప్రేమకు ఊపిరిలూదే శుభతరుణం
దేవుడు మనిషిని చేరే సంగమ సమయం
ఇహపరములకు నడుమన నిత్యనిబంధనం ||రండీ|| || (దేవుడు)||
2 వ చరణం..
విశ్వధాత్రికిది పరంధాముని శుభసందేశం
శాంతిస్ధాపనకు ప్రేమరూపుని నిజసంకేతం
అనురాగానికి ఆలంబన ఈ అమృతకలశం
ఆదిదేవుని ప్రియవాగ్ధానం ఈ బలియాగం ||రండీ|| || (దేవుడు)||