Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దేవుని ప్రేమకు చిహ్నముగా
మానవ జన్మకు సారముగా
పరులసేవలో పరవశమొందుచు
దైవ కుటుంబం స్థాపించండి 2
1 వ చరణం..
అబ్రహాము సారాల ఆదర్శబంధం
ఈసాకు రెబక్కాల ప్రేమబంధం
మరియ యోసేపుల పావనబంధం
యేసు ప్రేమలో వెలిగే బంధం దేవుని
2 వ చరణం..
కష్ట సుఖాల కలయికతో
వెలుగు నీడల సంఘమమై
తోడునీడగా బ్రతకాలి
ఇరువురు ఒకటిగా నడవాలి దేవుని
3 వ చరణం..
దేవుని చిత్తమే కుటుంబము
భార్యాభర్తల అనుబంధము
ఒకరికి ఒకరు అండగ నిలిచి
సత్య పధములో పయనించాలి