Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దీనుల దీవెనమ్మా నీవు అభాగ్యుల ఆధారమా 2
(అనాధల తల్లిగా) 2 క్రీస్తు ప్రేమకు సాక్ష్యమా
పునీత మధర్ తెరెసా జోహారులు
పునీత మధర్ తెరెసా మాకై ప్రార్ధించమ్మా
1 వ చరణం..
క్రీస్తులో ఎదిగి క్రీస్తులో ఒదిగి
ప్రభువును పేదలలో చూసావులే 2
వర్ణింప లేని సేవలు చేసి
దివ్యకారుణ్య లోతులు చూపి
(ప్రభు సాక్షివైతివి ) 2 పునీత
2 వ చరణం..
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
కలకత్తా నగరములో మురికివాడల్లో
క్రీస్తు ప్రేమను వెదజల్లితివి
అన్యులన్ సైతం అక్కునచేర్చి
(ధృవతారవైతివి) 2 పునీత