Type Here to Get Search Results !

దైవ ప్రేమచే ప్రజ్వలించిన ( daiva premache prajvalinchina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దైవ ప్రేమచే ప్రజ్వలించిన పు. అంతోనివారా

||మా కొరకు ప్రార్ధించండి|| 


మీ జపములచే ఆత్మల రక్షించ దీక్షను పొందినవారా.... 

||మా కొరకు ప్రభువును వేడండి|| 


మూర్ఖపాపులు పతితులెందరినో 

మనసులు తిప్పినవారా.... 

||మా కొరకు ప్రభువును వేడండి|| 


దివ్య రక్షకుని మార్గము 

బోధింప అంకితమైనవారా.... 

||మా కొరకు ప్రభువును వేడండి|| 


అనేక అద్భుత మహిమలు 

చూపగ వరములు పొందినవారా.. 

||మా కొరకు ప్రభువును వేడండి|| 


శరణని మీ దరి చేరిన 

దయతో మనవుల తీర్చెడివారా.... 

||మా కొరకు ప్రభువును వేడండి|| 


దివ్యబాలుని ముద్దిడు భాగ్యము 

పొందిన అంతోనివారా....

||మా కొరకు ప్రభువును వేడండి|| 


మీవలెనే మా శత్రుల మేము 

మన్నించుట నేర్పించండి.... 

||మా కొరకు ప్రభువును వేడండి|| 


దివ్యప్రసాద ప్రభువును భక్తితో 

లోకొన మము దీవించండి.... 

||మా కొరకు ప్రభువును వేడండి|| 


మరణవేళలో తోడుగ నుండి 

మోక్షమునకు నడిపించండి....

||మా కొరకు ప్రభువును వేడండి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section