Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దివిలో దేవునికి మహిమ..మహిమ
భువి జనులందరికి శాంతి సమాధానము ||2||
అని పాడిరి దూతలగానం నీ ధ్యానంలో
స్తుతియించి పాడిరి మహోన్నత గీతం
గ్లోరియా...గ్లోరియా ||2||
1. ఏలినవారైన సర్వేశ్వరా పరలోక రాజా
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా
మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము ||2||
మిమ్ము ఆరాధించెదము
మిమ్ము ఘనపరచుచున్నాము ||గ్లోరియా||
2. జన్మిక సుతుడా శ్రీయేసువా దేవుని గొర్రెపిల్ల
లోక పాపములు పరిహరించెడివారా
||మిమ్ము || ||గ్లోరియా||
3. పితకుడి ప్రక్కన ఆశీనుడా పావన శ్రీయేసువా
మా పాపమలను మన్నించు సర్వేశ్వరా
||మిమ్ము || ||గ్లోరియా||
4. పరిశుద్దులు మీరొక్కరే మహోన్నతులు మీరే
తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా
||మిమ్ము || ||గ్లోరియా||
ఆమెన్... ఆమెన్...ఆమెన్...ఆమెన్…