Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దివ్యమైన విందులో - త్యాగ విందులో
దైవసుతుడు వాసముండే ఈ భోజ్యంలో
కనివిని ఎరుగని ఈ ప్రేమ విందులో
గైకొని లోకొని తరించగా త్వరపడిరారండి ||దివ్య||
1. ప్రాణం పెట్టిన యేసునాధుని
ప్రేమ గురుతే ఈ భోజ్యం
విశ్వమందు ఆశ్రయస్థానం
ఆత్మల శరణమే ఈ భోజ్యం
ప్రేమ ఐన విందులో ప్రాణ విందులో
ఆత్మఫలము నొందుడు ఈ రుధిరంలో
కనివిని ఎరుగని ఈ ప్రేమ విందులో
గైకొని లోకొని తరించగా త్వరపడిరారండి ||దివ్య||
2. ఆత్మకు జీవం శరీర భాగ్యం
అందరివరమే ఈ భోజ్యం
కష్టములందు ఆపదలందు
నడిపే ధైర్యమే ఈ భోజ్యం
ప్రేమఐన విందులో ప్రాణవిందులో
ఆత్మఫలము నొందుడు ఈ రుధిరంలో
కనివిని ఎరుగని ఈ ప్రేమ విందులో
గైకొని లోకొని తరించగా త్వరపడిరారండి ||దివ్య||