Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: కోటి సూర్య ప్రకాశ... కోమలాంగి
గుణదల శిఖరముపై కలబోసి వెలసిన -
ఆశ్రిత... పాలకి... ప్రియమాత
వందనం... వందనం... వందనం
.. జగతికి తల్లి ఓ దేవమాత
మహిమకు నీ నామం నితరము నిజ నామం ||2||
1. పరలోక రాణివి నీవే - భూలోక రాణివి నీవే
పాపికి శరణం నీవేగా - ప్రేమ స్వరూపిణి నీవేగా
యేసుని తల్లివి నీవేగా సద్గుణ సుందరి నీవేగా
కరుణించే కల్పవల్లివి - అందరి అమ్మవు నీవేగా
2. నీ మాతృ ప్రేమను స్తుతియింపగా - కీర్తింతు నీ మధుర నామం
నిత్య సహాయిని కన్నతల్లి ఆనందమల్లిక మరియ తల్లి
ధరణికి వరనామం... ఇదియే దయగల ఘన నామం
ఇదియే అమలోద్భవి దివ్య రూపిణి మహిమకు నీ నామం ||2|| ||జగతి||