Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju
Album: స్వాగతమోదేవా
ప. జనని మరియా -చల్లని మాతా
జగతికి జ్యోతివి - యేసుని మాతా
1. కాగా పెండ్లిలో భక్తుని బ్రోచి
కరుణామూర్తిగా వెలసిన మాతా ||2||
నిత్యము మాకై ప్రార్థన చేసి ||2||
మమ్ముల కావుమా శ్రీసభ మాత ||2|| ||జననీ||
2. వేళాంగణిలో ఆరోగ్య మాతవు
ఫ్రాన్సు నగరిలో లూర్థుమాతవు ||2||
భక్తుల హృదిలో నెలకొన్న మాత ||2||
మా మనవులను ఆలించు మాత ||2|| ||జననీ||