Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1. జయ రాజు యేసు జండ
క్రింద సేవకు వస్తిమి
భయము లేక, పరమ బలమొంది
మేము సేవ జేయుదము
జయ గీతము పాడి,యుద్ధము జేసి
జయమునొందెదము
2. సేన నాయకుడు-నడిపించును
మమ్మున్ దివ్య జ్ఞానముతో
దిన సేవకులమై-దినమును వెంబడించి
సేవ జేయుదము
3. మన దేశమంతయు నెప్పుడు యేసుకు
స్వంతమవనున్నదో
అంధకారం తొలగి వెలుగొందు
కాలము తొందరలో రావలెన్