Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
రాగం: భూపాళ తాళం: ఆది
పల్లవి:
జీవ పూర్ణుడ దేవ దేవా- నిన్ను నమ్మి వేడుకొందుము
దేవా మము కావ రావా
1 వ చరణం..
జీవమడిగిన ప్రాణకోటికి- జీవ మిచ్చెడి స్వామి యేసు
విగతజీవులు వెతలు బాపి- నిత్య జీవము నిమ్ము దేవా
2వ చరణం..
దారి తెలియని అంధకారము- ఆవరించిన ఆశ్రితులను
వెలుగునిచ్చి చెంత జేర్చి - శాంతి గూర్పుము దేవా దేవా
3వ చరణం..
మహిమలు స్తుతులు మహిని జెల్లును
నోము పూజలు చేరు మిమ్మును
మృతులు మిమ్మును జేరి మిగుల- స్తోత్ర గీతం పాడగలరు