Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి
మనసే గుడిగా మలిచాను దేవా
ఆ మందిరాన కొలువుండవా ||2||
పరలోక రాజా దేవాది దేవా ||2||
మనసార నిన్నే ప్రార్థింతును ||మ||
1 వ చరణం..
పరలోకమందు భూలోకమందు
చిత్తమే నెరవేరును ||2||
శూన్యములో విశ్వం నిలిపిన దేవా ||2||
కాలాన్ని కట్టడిచేసి నడిపిస్తున్నావా..||2|| ||మ||
2 వ చరణం..
లోకమునెంతో ప్రేమించినావు
లేఖనము నెరవేర్చ తలంచినావు ||2||
ఏకైక కుమారుని ఇల పంపినావు
సగ రిసాని రిరి సానిస సనిస
నీపాద గరిసని గపనిస
లోక రక్షణము గావించినావు ||2|| ||మ||