Type Here to Get Search Results !

మంగళము దయ గల ( mangalamu dhaya gala Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1:- 

మంగళము దయ గల మా యేసు మాతకు

మంగళము తరుణీ మణి మరియాంబకు 

మంగళము మహిమగల మా తల్లికి

జయ మంగళం నిత్య శుభ మంగళం llజయ ll 


2:- 

శృంగారమైనట్టి చంద్ర సింహాసనము

బంగారు గజ్జెలు పాదములకు

శృంగారమైనట్టీ బంగారు మొలకవలె 

రంగు మీరగ నున్న రమణీయమణికి llజయ ll 


3:- 

నవ విలాసపు సన్మనస్కాలి రాణియై

నవ రత్న ఖచితమౌ నాయకియునై

హేవను జంపిన హీన సర్పంబును

భవ్యముగ ద్రొక్కిన పావన మర్యకు llజయ ll 


4:- 

నిర్మంబై యుండు నీతిగల తల్లికిని

ధర్మంబు జూపెడి ధన్యురాలికి

కర్మంబు రాకుండ కడతేర్చు తల్లికిని 

మర్మంబు లేనట్టి మరియమ్మకు llజయ ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section