Type Here to Get Search Results !

మంజుల నాదంతో ( manjula nadhamtho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప|| మంజుల నాదంతో - దేవుని స్తుతింతుము

రంజిత మనసులతో - ప్రభువును పొగడెదము 

సుమములతో - ప్రమిదలతో ||2|| 

కరుణామూర్తిని ఆరాధింతుము 

ఆలయ గంటలు మ్రోగిన వేళ

అర్చన చేతుము - పావన తండ్రికి 


1. ఉన్నత ఆకసమా - సూర్య చంద్రులారా

పర్వత శ్రేణులు - జల సముదాయము 

సుజనుని వినుతించుడి ||2|| 

పరలోక దూతలు-భువిలోన ప్రాణులు ||2|| 

సమస్త పాలకులు - వినుతించి పాడుడి ||2||

||ఆలయ గంటలు|| 


2. శాంతి సుధాకరుని - దివ్య కుమారుడు

ప్రియుడగు సుతుని - దాక్షిణ్యమూర్తిని 

కీర్తించి కొనియాడుదాం ||2|| 

పరలోక రాజ్యము-భువిలోన స్థాపింప ||2|| 

సిలువను భరించెను - నవ జీవం పోసెను ||2||

||మంజుల నాదంతో|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section