Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
మేఘాలపైన రానై యున్న - యేసురాజును
మహామహిమతో రానైయున్న - దేవదేవునికి
రారండి స్వాగత మివ్వ - ఓ గొర్రెపిల్ల సంఘమా
త్వరపడి వేగమే - రారండి .....llమేఘాll
1 వ చరణం..
పరిశుద్ధులతో దూతలతో - వైభవంబుగా
పరికింపగను పరవశముతో - పరమదేవుని
పరిశుద్ధునిగా నీవుండెదవా - పరివర్తనతో
నిలచెదవా పాపుల రక్షకుని చెంత -
పసిడి మనసుతో నిలచెదవాllమేఘాll
2 వ చరణం..
పసిపాపల హృదయాలతో - పావనమూర్తిని
పవిత్రమైన చేతులతో - ఆరాధింపగను
మహిమ ఘనత స్తుతియు - క్రీస్తుని యుగములన్నిట
మహోన్నతుడైన దేవునికి - నిరతము స్తోత్రగానము llమేఘాll