Type Here to Get Search Results !

మౌళిక సంఘాలు చిరు ( moulika sangallu chiru Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

మౌళిక సంఘాలు చిరు క్రైస్తవ సంఘాలు ||2|| 

ఇరుగు పొరుగు అంతా కలిసి 

పేదా గొప్పా బేధం మరచి ||2|| 

ఎదిగే క్రైస్తవ సంఘాలు ` 

ఇవి యేసు సువార్త సంఘాలు ఓ... ఓ... ఓ...llమౌళికll 


1 వ చరణం.. 

యేసుమాటనే బ్రతుకు బాటగా మలచుకుని

ఏడు దశలలో ప్రార్ధన చేయుట నేర్చుకొని ||2|| 

దేవుని మనసుని తెలుసుకొని దేవుని మదిలో నిలుపుకొని ||2|| 

ధ్యానం చేసే సంఘాు ` ఇవి ప్రార్ధనా సంఘాలు

ఓ... ఓ... ఓ...llమౌళికll 


2 వ చరణం.. 

అపకారుల కుపకారం చేసే ` ఉత్తమ సంఘాలు

చిత్తశుద్ధితో సేవలు చేసే ` సేవక సంఘాలు ||2|| 

దేవుని పాలిట కోవెలలు ` బలహీనులకివి అభయాలు ||2|| 

సజ్ఞన సంఘాలు ` సత్ క్రైస్తవ సంఘాలు

ఓ... ఓ... ఓ...llమౌళికll 


3 వ చరణం.. 

నాయకులంటే సేవకులోయి ` నియంతలిక్కడ లేరోయి 

నీతి న్యాయ సేవాభావం ` కలవారిచ్చట ఘనులోయి ||2|| 

స్వయం పాలక, స్వయం పోషక, స్వయం సమృద్ధి సంఘాలు ||2|| 

ప్రార్ధన సంఘాలు ` సత్ క్రైస్తవ సంఘాలు

ఓ... ఓ... ఓ...llమౌళికll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section