Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 1
ప యాజకుడా క్రీస్తురాజా
నిత్యగురువా నీతిమంతుడా
పాడెదము స్వాగతగీతం
దూతల బృందముతో కలసి పాడుదాం
కోరస్: స్వాగతం సుస్వాగతం
స్వాగతం ఘనస్వాగతం
1. పరమ దేవుని ప్రియసుతుడు.
లోక ప్రధాన అర్చకుడు ||2||
సర్వపాప పరిహారార్థము
సత్య సమర్పణ గావించెను ||2|| ||స్వా||
2. ప్రభుని సన్నిధి మోకరించి
హృదయ అర్చన చేయుదాం. ||2||
చేతులు మోడ్చి ఆరాధించి
దేవుని దీవెనలు పొందుదాం ||2|| ||స్వా||