Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
నా ప్రాణమా నా జీవమా - నడిపించు నాదైవమా... ||2||
హృదిలో వేంచేసి పవిత్ర పరచుము... ||2||
స్తోత్రమయా స్తుతి స్తోత్రం... ||2||
శరణం దేవా శరణం ప్రభువా
శరణం శరణం... ||2|| llనా ప్రాణమాll
1 వ చరణం..
ప్రేమతో పిలచి నన్ను ఎన్నుకొన్నావు
కరుణతో నన్ను మలచి దీవించావు ||2||
బలహీనతలన్నీ తొలగించావు
దివ్య వరముతో నన్ను అభిషేకించావు ||2||
స్తోత్రమయా స్తుతి స్తోత్రం... ||2|| llనా ప్రాణమాll
2 వ చరణం..
బాధలలో వేధనలో ఆనందములో
జీవితాంతం నిన్ను తలచి ధ్యానించెదను ||2||
ఎన్ననడు మరువకను నీ సేవలో
నీదు మహిమను నిత్యం ఘణపరచెదను ||2||
స్తోత్రమయా స్తుతి స్తోత్రం... ||2|| llనా ప్రాణమాll