Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
నీ చెంత బలమున్నది -
ప్రభూ నీవే నా ఆశ్రయము
నా చెంత నీవుండగా నాకు లేదు భయం
1 వ చరణం..
అపవాది నన్ను వెంటాడిన
అపదూరులెన్ని నను మోసిన
నీ ఘనమైన హస్తం నాకు తోడుగా
నన్ను చేరదీసి కాపాడగా llనీ చెంతll
2 వ చరణం..
నా వారే నన్ను హింసించగా -
పరిపరి విధముల భావించగా
నీ ఘనమైన హస్తం నాతోడుగా
నన్ను చేరదీసి ఓదార్చగా llనీ చెంతll