Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ ఆలయమున ఒక్కదినముండుట
వేయి దినముల దీవెన
అదే జీవిత కాలపు ధన్యతా .
ప: నీ ఆలయమున ఒక్క దినముండుట
వేయి దినముల దీవెన నాకు
నీ సన్నిధిలో నిరతము నిలుచుట -
జీవిత కాలపు ధన్యత దేవా ||2|| ||నీ ఆలయ||
1, గురువులతో చేరి బలి అర్పించగ -
హృదయ వేదనలు మనవి చేయగ
కరుణ మూర్తివని నీ దరిచేరగ -
శాంతిని యొసగుమ మరియ తనూజ ||నీ ఆలయ||
2. దేవ దూతలు నిను కీర్తించగ -
పరిశుద్ధులు నిను వేనోళ్ళ పొగడగ
అల్పులమైన మా స్తుతి గానం
నీ పదము చేర భాగ్యము నొసగుము ||నీ ఆలయ||