Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నిర్మల మనసుల ప్రమిదలతో
మమతల మంగళ వాయిద్యాలతో
వేగమే రారండీ ll2ll
తన కమ్మని విందుకు రమ్మని
మీకు కబురును పంపాడు
పెండ్లి కుమారుడు రాజాధిరాజుll2ll llనిర్మలll
1.చరణం:
మెలకువతో ప్రార్ధనను ఆలకించండి
నిను ప్రేమతో పిలిచినా రాజుని
వినయముతో నమ్మికతో స్వీకరించండి
తన ప్రేమతో మలచిన దేవుని ll2ll
మంచిచెడ్డ వారని చూడక
కుంటి గ్రుడ్డి వాడని వీడక
పిలుచున్నాడు ఇలలో పంచుచున్నాడు ll2ll
జీవన మాధుర్యం పావన ఆహరంll2ll llనిర్మలll
2.చరణం:
కష్టములొ సావ్ ఖ్యములో కీర్తించండి
మీము కరుణతో బ్రోచిన యేసుని
సహనంతో త్యాగముతో అనుసరించండి
తన ప్రాణంపోసిన క్రీస్తుని ll2ll
పేద ధనిక వారని చూడక
కులము వర్గమూ వారని చూడక
పిలుచున్నాడు ఇలలో పంచుచున్నాడు ll2ll
జీవన మాధుర్యం పావన ఆహరంll2ll llనిర్మll