Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నిరంతరం నీ సన్నిధిని నే చేరాలని
నిరంతరం నీ నామమును స్తుతియించాలని
చేరితిని సన్నిధికి 2
నీకే ఆరాధన నీకే స్తుతి కీర్తన 2
1 వ చరణం..
(దేవాదిదేవుడు పరమునుండి
వేంచేయు వేళ ఇదియే
నిన్ను నన్ను అందరిని దీవించు
గడియ ఇదియే) 2
(రండి పూజా సమయమిదే
ప్రభుని స్తుతించు గడియ ఇదే) 2
(సంగీత స్వరాల గానాలతో
రాజాధిరాజుకు స్వాగతం ) ||2|| ||నీకే||
2 వ చరణం..
(వెలుగును నింపుము నాలోన
నీతిసూర్యుడా నా ప్రభువా
చీకటి తొలగించు నా మదిలో
జగముల నేలే నా దేవా) 2
(ప్రభు మహిమలను స్తుతించుచు
ఆయన బాటలో నడవగ) 2
(చేరితిని నీ సన్నిధికిగగభ
వేంచేయు దేవా స్వాగతం) ||2|| ||నీకే||