Lyrics: Fr. Gnanam SDB
Tune: Fr. Gnanam SDB
Music: Naveen M
Album: ప్రణతులు-4
సాకి:ధవళసింహాసనమునకు అధిపతియైన సర్వేశ్వరా
పితా, పుత్ర, పవిత్రాత్మ నా అనుబంధమా
అందుకొనుమా మాదు ప్రణతులు
నీకివే మా ప్రణతులు ||ప్ర|| |l4||
ప. నిను చేరగా నిను కీర్తించగా
నా హృదయం పద్మము వలె వికసించిపోగ ||2||
సదా నీ పూజలో నే లీనమవ్వగా
దరిశన మియ్యవా దీవెన లిడవా ||2|| ||ని||
1. పితపుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిదియే
ప్రేమమీరా ప్రియ పుత్రుని బలియాగమిదియే ||2||
పీడితులందరికి ముక్తిని కలిగింతునని ||2||
పలికి నడిచి నడిపిన నజరేయుడా ||2|| ||ని||
2. సహవాస మొనరించు బలిపీఠమిదియే.
సర్వమానవాళికి సంజీవి సిలువయే ||2||
కరుణకు ఈ బలియే కారుణ్య రూపము ||2||
కరము శిరము మలచి నిను కొలిచెదము ||2|| ||ని||