Lyrics: Fr. Thumma Velangini
Tune: unknown
Music: Christopher Babu
Album: అమృత స్వరం
ప. నీ పాద సేవలో నిరతము పయనింతును
నీప్రేమ బాటనే నిత్యము ప్రకటింతును ||2||
యేసయ్య నిను అనుసరించెదను
మెస్సయ్య నిను వెంబడించెదను ||2|| ||నీ||
1. ఉన్నత శిఖరమున నను నిలుపువాడవు
ఉపదేశించుట నాకు నేర్పువాడవు ||2||
ఉత్సాహమోసగి నడిపించువాడవు ||2|| ||యే||
2 సమృద్ది జీవమును నాకిచ్చువాడవు
సత్యమును నిత్యము బోధించువాడవు
మేలైన మార్గములో నను నడుపువాడవు
కరుణామృతమునుకురిపించువాడవు ||యే||