Type Here to Get Search Results !

నీ పూజకు వేళాయెనే ( ni poojaku velayene Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


హే... పరమేశ్వరా... పరాత్పరా... 

విశ్వవిధాతా. విమల చరితా... 

ప్రాణ ప్రదాతా... జీవన నేతా... 

యేసుదేవా... మరియసుతా.. 

నమస్తే... నమస్తే.... సమోస్తుతే...


సని సరిసని గరిస నిసనిస నిస నిపనిస

పనిస మ రిగమ ఆ... ఆ... సని పదనిస 


ప|| నీ పూజకు వేళాయెనే...

నీ పూజకు వేళాయెనే... దేవా... 

నిను చూడ మనసాయెనే ||2|| 

ప్రాణికోటికి నీవే ప్రభువు - 

పావన ప్రేమకు నీవే నెలవు ||2|| 

నూరేళ్ళ ఈ జీవితం - నీ సేవకే అంకితం ||2||

స్వాగతం - స్వాగతం - దేవా మనసార 

ఘన స్వాగతం ||2|| ||నీ పూజకు|| 


సనిసరి సనిసరి సరిసని | పని సరి పనిసరి 

సరిగగ రిగపప గమరిరగి సరిమప రిగపసని 


1. ఏ నోములు నే నోచితినో

ఏ తపములు నే చేసితినో 

నీ సేవకోసమే పిలిచావు 

నీ పూజలు చేయగ దీవించావు 

జీవితమంతా పదసన్నిధిలో... ||2|| 

ప్రమిదగ వెలిగే వరమియ్యిదేవా ||2|| 

స్వాగతం - స్వాగతం - దేవా మనసార 

ఘన స్వాగతం ||2|| ||నీ పూజకు|| 


2. నీ మందిరమే నా ఇల్లైతే

ఆ కోవెలలో నేనుండిపోతే 

ఎంత పాడినా తనివి తీరదే 

ఎంత వేడినా వేళ చాలదే 

సుందర సుమధుర నీ రూపమునే... 

సరిగరి సరినిస నిపగపగరిస 

రిసరిగ పనిస రిసరిగపనిసనిస... 

రిసరిగ పనిసగరి 

సుందర సుమధుర నీ రూపమునే - 

తిలకించిన జన్మధన్యము దేవా ||2|| 

స్వాగతం - స్వాగతం - దేవా మనసార 

ఘన స్వాగతం ||2|| ||నీ పూజకు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section