Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నీ ప్రేమతో నన్ను నింపుము దేవా "
నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా
జ్ఞానమున్న గాని - విస్వాసమున్న గాని
ప్రవచింప గల్గిన కానీ
ప్రేమలేని వాడనైతే వ్యర్ధుడనయ్యా నే
1. నీ ప్రేమ సహనము కలది
నీ ప్రేమ దయ గలది
నీ ప్రేమకు డంభము లేదు
నీ ప్రేమకు గర్వములేదు
నీ ప్రేమకు అసూయ లేదు
నీ ప్రేమకు స్వార్ధము లేదు
నీ ప్రేమకు అమర్యాద లేదు
నీ ప్రేమకు కోపము రాదు
నీ ప్రేమ గుణములతో నను నింపుము
నీ ప్రేమను ప్రదర్శించే వరమీయుమ ||నీ||
2. నీ ప్రేమ దోషం లెక్కింపదు
నీ ప్రేమ కీడుతో ఆనందించదు
నీ ప్రేమ సత్యమునే సంతసించును
నీ ప్రేమ సమస్తమును భరించును
నీ ప్రేమ సమస్తమును విస్వసించును
నీ ప్రేమ సమస్తమును ఆశించును
నీ ప్రేమ సమస్తమును సహించును
నీ ప్రేమ శాశ్వతముగా నిలచిపోవును
నీ ప్రేమ గుణములతో నను నింపుము
నీ ప్రేమను ప్రదర్శించే వరమీయుము ||నీ||