Type Here to Get Search Results !

నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము ( ni vakyamanina nakentho preethikaramu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune: K Joseph 

Music: Christopher Babu 

Album: అమృత స్వరం 


ప. అల్లెలూయ అల్లెలూయ - హెూసన్నా ఆమెన్ 

నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము 

నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము ||2|| 

నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును 

నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును 

హల్లెలూయ... హల్లెలూయ... ||2|| 


1. నిర్మల హృదయముతో నీ వాక్యమును 

నేర్చుకుందును-రేయి పగలు ధ్యానింతును

అద్భుత విషయములు గ్రహింతును 

హృదయఫలకముపై నీ నామమును రాసుకొందును 

నీ జ్ఞానము పొంది జీవింతును 

నీ ఆజ్ఞలను పాటింతును ||అల్లె|| ||నీ|| 


2. ధనికునిగా ఉండి -నిరుపేదగా పుట్టెను 

తగ్గింపు మనస్సును మనకిల నేర్పించెను ||2|| 

శాంతి దాతగా ఉదయించెను 

సంతోష వార్తను మనకిచ్చెను 

చిన్నారి బాలును దర్శింతుము 

చింతలు మరచి జీవింతుము | ||అల్లె|| ||నీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section