Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప నీతో స్నేహం నాకెంతో మేలయ్యా
నీ సహవాసం నాకుంటే చాలయ్యా
అ. ప. నమ్మదగిన నా మంచి యేసయ్యా
ఎన్నదగిన నన్ను పిలిచినావయా
1. నీ స్వరమును విని తలుపులు తెరువగా
లోనికి వస్తానన్నావయా
నాలో నివాసముండగోరిన
నాతో భుజింప నన్ను చేరిన
2. ఇద్దరు ముగ్గురు ఓ చోట కూడగా
వారితో ఉంటానన్నావయా
నీలాగ వెలుగులోనే నడిపిన
నా పాపదోషమంత కడిగిన
3. ఎమ్మాయి దారిలో నీతోటి నడువగా
హృదయం మండించినావయా'
నీ లేఖనములు తేటపరచిన
అజ్ఞానతిమిరం తొలగించిన
4. పామరశిష్యులు నీతోనే ఉండగా
ధైర్యము ప్రసాదించినావయా
నీ సేవచేయు కృపను ఇచ్చిన
నీ ప్రేమచాట ఇలలో ఉంచిన