Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీవులేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని ||2||
లోక ఆశలు క్షణికమేఅని తెలిసినంతలో శూన్యమైపోతిని ||2||
ఆదరించుమా నజరేయుడా ఓదార్చుమా నీతి సూర్యుడా ||2||
1. గాలి తగిలి ఎగిరిపోవు పొట్టువంటి ఆశతో -
ఈలోక సంపదకై తహతహలాడితిని
నిజ సంపద నీవని తెలుసుకున్నంతలో -
మంచువలే నేను మరుగైపోతిని ||ఆదరించుమా|| ||నీవులేని||
2. సంద్రపు నురగలా చెదరిపోవు పేరుకై -
అడ్డదారిలో నేను పయనమైపోతిని
నీ చేతిలో చెక్కిన పేరునని మరచి -
ఒక్కరోజు అతిధిలా మాసిపోతిని ||ఆదరించుమా|| ||నీవులేని||