Type Here to Get Search Results !

నీవే చాలయ్య యేసు ( nive chalaya yesu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీవే చాలయ్య - యేసు నీవే చాలయ్యా 

నా జీవితానికి - నీవే మేలయ్యా ||2|| 

ప్రేమించువాడవు - పాలించువాడవు 

క్షమించువాడవు - నీవే యేసయ్యా ||2|| 

నా కన్నీటిలోయలో - నను లేవదీసిన ... 

నీవే చాలయ్య - యేసు నీవే మేలయ్యా ||2|| llనీవేll 


1 వ చరణం.. 

ప్రేమించెవారు లేక - పక్షినైతిని 

దరిచేర్చే వారు లేక - దూరమైతిని ||2|| 

క్షమియించేవారు లేక - దోషినైతిని ... 

పాప పరిహారముకోరి - నిన్ను చేరితి ... 

నా పాపాన్ని నే వోర్చి - నను మనిషి చేసిన 

నీవే చాలయ్యా - యేసు నీవె మేలయ్యా ||2|| llనీవేll 


2 వ చరణం.. 

నేను పుట్టకముందే నీవు - నన్ను చూచితివి 

రూపించబడకముందే - నన్ను ఎరిగితివి ||2|| 

పిండముగా ఉన్నప్పుడే - నన్ను ఏర్పరచితివి 

అర్హత లేకుండా - నన్ను ప్రేమించితివి 

నీ కల్వరి ప్రేమతో నన్ను గెల్చుకున్నట్టి 

నీవే చాలయ్యా యేసు నీవె మేలయ్యా ||2|| llనీవేll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section