Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నీవు ఊదిన ఊపిరి నేను
నీవు మలచిన జీవిని
నీవు లేనిదే నాకు బలము
లేదిల దైవమా నిరతము
నీ దారిలో నేను నడువగను నీడవై తోడుగా
నా చెంత నుండుము దైవమా
1. చీకటి నిండిన నా బ్రతుకులో
వెలుగుని నింపే దేవుడవు
పాపము చేసిన పాపిని నన్ను
శాపము బాపి బ్రోచు వాడవు
నిన్ను కాదని నేను ఇలలో ఏమి సాధించేను
ప్రభు నీవే నా గమ్యము
2. అడుగులు తడబడినప్పుడు నన్ను
ఆదుకొని ఇల నడిపించువాడవు
ఆపదలందు నే మొరలిడినప్పుడు
ఆలకించి నన్ను దీవించు వాడవు
నిన్ను కాదని నేను ఇలలో ఏమి సాధించేను
ప్రభు నీవే నా శరణం