Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నూనెలేని దీపం వలె
అలమాడుతున్నది నా యాత్మ
ఆశ అనే గాలిలో
పాపం అనే తుఫానులో ||2||
ఆరిపోతుంది నా దీపం ||2||
శరణం శరణం దేవా ||2||
1. నా యింటి దీపం నీవేనని
తలచి నీకై తపియించాను ||2||
లోకాన వెలుగు ప్రసరించు దేవా ||2||
హృదయాల చీకటి తొలగించరావా ||2|| ||నూ||
2. కొడిగట్టిపోతున్న నా జీవితం
పొందాలి దేవా నీ యాత్మను
పరిశుద్ధ దేవా నీ యాత్మను ||2||
పరిశుద్ధ తైలముతో అభిషేకించు
నీ సాక్షిగా నన్ను యిల నిలుపు ||2|| ||నూ||