Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 5
పగలు మేఘమై వచ్చావు - రాత్రి అగ్నిగా వచ్చావు ||2||
నా ఆకలిలో మన్నాగా - నా దాహంలో నీరుగా ||2||
వచ్చావయ్యా యేసు - సేదదీర్చగా అర్పించావయ్యా యేసు - నిన్ను నీవుగా ||2||
నీ ప్రేమ గొప్పది ...... నీ కరుణ గొప్పది....
నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది
1 వ చరణం..
ధరణిలో పాపమే తాండవించుచుండగా
నరునిగ జన్మించితివి పాపవిముక్తి నిచ్చితివి
ఈ లోకంలో చీకటే రాజ్యమేుచుండగా
వెలుగై అవతరించితివి..... చీకటి పారద్రోలితివి....
నీ రక్తాన్ని చిందించి రక్షణ నిచ్చిన యేసుక్రీస్తువా
నీ గాయాలతో మాకు స్వస్థత నిచ్చిన
మంచి నేస్తమా.... ||నీ ప్రేమ గొప్పది||
2 వ చరణం..
ఆత్మలో శక్తిలేక కుమిలి పోవుచుండగా
ఆత్మాహారమైతివి - ఆత్మాకలిని తీర్చితివి
శోధనలో చిక్కుకుని - బలహీనుడవ్వగా
నీ కృపతో నింపితివి - నీ కృప చాలంటివి
నీ హృదయాన్ని తెరచి
ప్రతీ పాపినుంచిన యేసుక్రీస్తువా
ఎంత ఘోర పాపినైన మన్నించు
దివ్యకారుణ్యమా . ||నీ ప్రేమ గొప్పది||