Type Here to Get Search Results !

పాల్గొనరారే ప్రేమ విందులో ( palgona rare prema vindhulo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పాల్గొనరారే ప్రేమ విందులో 

లోకొనరారే దివ్య భోజ్యము 

పాస్కా విందుకై పరుగిడిరారే 

పావనుడేసుని ఈ బలివిందుకు 

కడరా విందుకు ......... 

తనన - ననన - న ||పాల్గొన|| 


1. అప్పమునందుకొని, ఇది నా దేహమని,

పలికిన ప్రభువగు, క్రీస్తుని దేహమిది 

రసమును అందుకొని, ఇది నా రుధిరమని, 

నుడివిన నాధుని, రక్తపు పానమిది 

భుజింపరారే భక్త జనాంగమా

ఆకలి తీరగా ప్రభు దేహంబును 

త్రాగను రారే క్రీస్తుని సంఘమా 

దాహము తీరగా ప్రభు రుధిరంబును

ఈ బలి విందులో ........ తనన ననన న

||పాల్గొన|| 


2. మనుజుల పాపముకై, రక్తము చిందించి, 

రక్షణ నొసగిన, యేసుని విందిది 

మూడవ దినమున, మహిమతోలేచిన, 

మృత్యుంజయుడగు, క్రీస్తుని విందిది

గైకొనరారే దివ్యాషధమును 

ప్రేమామృతమగు ఈ సంజీవిని 

ఆర్తితో రారే ఆ ప్రభు విందుకు 

ప్రియుడగు క్రీస్తుని పావన విందుకు 

ప్రభుని పొందుకు 

తనన.. ననన......న ||పాల్గొన|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section