Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పాపులు గాచెడి యో ప్రభువా
పాపము బాపుము యీ భువిలో
1. సత్ప్రసాదములో దాగినవో
సతత జీవుడా దయగొనుమా
సత్యము నీవే జీవము నీవే
సత్యపు మార్గము నీవే మాకు ||పా||
2. జీవజలము మా కొసగుటకై
త్రోవ జూపు ఓ జేసు ప్రభూ
బ్రోవుము మమ్మున్ - జీవనదాతా
పావనుడ-యీ పాపులను ||పా||
3. దివ్యమైన-ఈ ఔషధమున్
జాల మెంతయు లేక మనం
జీవము నొంద-లోకొనబోధం
రారే పురజన సంఘమిట ||పా||