Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకీ :రండి.... రండి.... ప్రభుని సన్నిధికి
సంతసముతో.... దివ్య పెన్నిదికి
ఆ...ఆ....ఆ...
పల్లవి:
ప్రేమతో రండి దైవ జనమా ప్రభుని సన్నిధికి
విశ్వసించి సంతసముతో దివ్య పెన్నిధికి
ఆహ్వానింతుము దేవుని కుమారుని ||2||
రండి...రండి... ll3|| దేవుని సన్నిధికి దివ్యపెన్నిధికి
1 వ చరణం..
ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుము
జీవమిచ్చె పరమ వాక్యం మారు మనస్సు ప్రసాదించును
సంపూర్ణ హృదయాలతో పాల్గొనుడీ పూజలో ||2||
2 వ చరణం..
ప్రభుని విందును స్వీకరింప దివ్యబలిలో పాల్గొందము
ఆత్మను నింపే అమర విందును ఆరగించి తరియించుదాం
సంతోష హృదయాలతో వేంచేయుడీ పూజకు ||2||