Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పుడమిపై పుట్టినాడు దివ్య బాలుడు
ఈ బాలుడే జగమునేలు దేవదేవుడు
పశులపాకలో పవ్వళించెను -
మానవాళి మనుగడకై (ముక్తికొరకు) మనుజుడై
1. పరమ దూతలెల్ల ప్రభుని పొగడగ -
జ్ఞానులెల్ల యేసు చేరి కొలువగ
పరవశాన ప్రజలెల్లరు గాంచగా -
ఎగిరి సిందేసి బాలయేసు చేరగా
2. దైవ సుతుడు ధరచేరగా దీనుడై -
కరుణ జూపి కన్య మరియ తనయుడై
పసిడికాంతి చిందించెను పుడమిపై -
లాలి లాలనుచు గళమెత్తిరి ప్రభునికై
3. రాజులకే రాజైన యేసువు -
మన చింతలన్ని చెంత చేరి బాపును
తన రాజ్యమునకు మంచి దారి చూపును
ఎగిరి సిందేసి తన ఘనతను కొలుతుము