Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పుట్టెనమ్మా యేసు పుట్టెనమ్మా
బెత్లహేము పురములోన
పూరిపాక నీడలోన
కన్య మరియ పుత్రునిగా
రక్షకుండు పుట్టెనమ్మా
1. ఆకసాన దూతగణము
మహిమ స్తుతులు పాడగా
గొల్లలెల్ల తరలివచ్చి ||2||
దైవసుతుని గాంచిరి
తూర్పుదేశ జ్ఞానులొచ్చి
కాన్కలిచ్చి వెళ్ళిరి
2. నింగిలోన తోకచుక్క
తళుకులీని నాట్యమాడి
రక్షకుండు బాలరాజు
పుట్టెనంచు చాటెను
పూజించ రారండి దేవాది దేవుని
3. మన ఊరే బెత్లహేము
మన ఇల్లే పూరి పాక
దీన హృదయాలలో యేసయ్య పుట్టునండి
నీవు నేను మనమంత
హృదయాలను అర్పిద్దాం