Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 7
పునీత జోజప్ప - తిరుకుటుంబ పాలకా
నామము పావనం - నీ జీవితం ధన్యము ||పునీత||
1. అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి -
అలుపెరగని ఓ శ్రామికుడా (2)
మా యింటి యిలవేల్పువై
మా జీవిత చుక్కానివై - మమ్ము దీవించుమా ||పునీత||
2. యేసు మరియకు కావలివారా-
శ్రీసభను కాయుమా (2) నీతి నిలయమా -
ఓర్పుకు మూలమా మమ్ము రక్షింపుమా ||పునీత||
3. విశ్వాస పాత్రుడా - విధేయుడా విధేయత
నేర్పించుమా (2) మరణ ఘడియలో -
మా ఆత్మ దీపమై మా వెంట రావయ్య -
మా వెంట రా రావయ్య ||పునీత||