Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
రమ్మనుచున్నాడు - నిన్ను ప్రభుయేసు
వాంఛతో తన - కరము చాపి
రమ్మనుచున్నాడు ||2||
1. ఎటువంటి శ్రమలందునూ
ఆదరణ నీకిచ్చుననీ ||2||
గ్రహించి నీవు-యేసుని చూచిన
హద్దులేని ఇంపు పొందెదవు ||రమ్మను||
2. కన్నీరంతా తుడచును
కనుపాపవలె కాపాడున్ ||2||
కారుమేఘంవలే - కష్టములు వచ్చినను
కనికరించి నిన్ను కాపాడును ||రమ్మను||
3. సొమ్మసిల్లు వేళలో
బలమును నీకిచ్చును ||2||
ఆయనే నీ వెలుగు-రక్షణీయుడైనందున
ఆలసింపక నీవు త్వరపడిరమ్ము ||రమ్మను||
4. సకల వ్యాధులను-స్వస్థపరచుటకు ||2||
శక్తిమంతుడగు-ప్రభు యేసు ప్రేమతో
అందరికీ తన కృపలనిచ్చున్ ||రమ్మను||