Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: రండి యెహెూవాను గూర్చి
ఉత్సాహ గానము చేసెదము
ఆయనే మన పోషకుడు -
నమ్మదగిన దేవుడని
ఆహా... అల్లెలూయా..ఆహా.. అల్లెలూయా
1. కష్ట నష్టము లెన్నున్నా -
పొంగు సాగరమెదురైనా
ఆయనే మన ఆశ్రయం -
ఇరుకులో ఇబ్బందులలో ||2||
2. విరిగి నలిగిన హృదయముతో-
దేవ దేవుని సన్నిధిలో
అనుక్షణం ప్రార్థించినా -
కలుగు మేలులు మనకెన్నో||2||