Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి
రండీ ఈ శుభవేళ - దేవుని సన్నిధికి
జీవిత దేవుని కీర్తించ - ప్రాణ ప్రియుని ప్రార్థించ ||2||
1 వ చరణం..
ఇద్దరు ముగ్గురు కూడినచోట - నింపును తన సన్నిధిన ||2||
మనస్సును మందిరముగ మలిచి-మదిలో యేసుని రూపము నిలిపి
ధూప దీప ఆరాధనతో - స్తోత్ర గీతిక మాలికతో
ప్రభు సన్నిధికి చేరుదము - ప్రభు దీవెనలు పొందుదము ||2||
2 వ చరణం..
హృదయ ద్వారము చెంతన నిలచి - పిలుచుచున్నాడు ఘన దేవుడు
హృదయము తెరచిన ప్రతివానిలో వెలిగించును నూతన దీపం
ప్రేమశాంతి ఆనందముతో - నవ్యజీవిత సౌఖ్యముతో
ప్రభు సన్నిధికి చేరుదము - ప్రభుదీవెనలు పొందుదము ||రండి||