Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
రండి ఉత్సాహించి పాడుదము -
రక్షణ దుర్గము మన ప్రభువే
1. రండి కృతజ్ఞత స్తోత్రముతో -
రారాజు సన్నిధికేగుదము
సత్ప్రభు నామము కీర్తనల్ -
సంతోష గానము చేయుదము
2. మన ప్రభువే మహ దేవుండు -
ఘన మహాత్యము గలరాజు
భూమి అగాధపు లోయలును
భూధర శిఖరములాయనవే
3. సముద్రము సృష్టించే ఆయనయే -
సత్యుని హస్తమే భువిచేసెన్
ఆయన దైవము పాలితుల -
ఆయన మేపెడి గొర్రెలము
4 ఆ ప్రభు సన్నిధి మోకరించి -
ఆయన ముందర మ్రొక్కెదము
ఆయన మాటలు గైకొనిన -
అయ్యవి మనకెంతో మేలగును
5. తండ్రి కుమార శుద్దాత్మకును -
తగు స్తుతి మహిమలు కల్గుగాక
ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు -
అయినట్లు యుగముల ఔను ఆమెన్