Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. రండి ఓ జనమా యేసు విందుకు
ప్రభుని చేకొనగా వేవేగమే పరమ పదము
చేర్చెడి పావన విందు
అశువులన్ని బాపెడి అమృత విందు
1. ఐక్యతను ఒసగే విందు
అమర జీవ మిచ్చెడి విందు
ఎందరినో కాచెడి విందు
యేసు క్రీస్తు స్మారక విందు
ఆరగింప రారే అద్భుత విందు ||ర||
2. కడరాత్రి సమయము నందు
కరుణామయుడిచ్చిన విందు
పాదములు కడిగే విందు
ప్రేమ ఆజ్ఞ ఇచ్చిన విందు
ప్రీతితోడ లోకానరండి
మన ప్రభు విందు ||ర||