Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju
Album: వాక్యప్రకాశిని
స, రండి ప్రియులారా ప్రభు యేసుని స్వీకరింప
భక్తితో అనురాగముతో వేగమే రారండి
ప్రభు యేసుని పొందండి ||ర||
1. పిశాచి రాజ్యమే పటాపంచలై
జీవము పంచే దివ్య భోజ్యమై ||2||
నవ్యజీవమే స్వర్గ సీమయై
ప్రేమ జగతియే పునాదియై ||2|| ||ర||
2 శోధన బాధలో బలమును గూర్చి
పాపుల మనసులో ఉజ్వల తేజం ||2||
నీ హృది ఏసుని ప్రేమ పీఠమై
చిగురించి బ్రతుకును జీవింపచేయును ||2|| ||ర||
3. కాపరి యేసుని జీవము పొంద
కరములు జోడించి వేగమెరండి ||2||
సత్యము జీవము మార్గము ప్రభువే
సహృదితో ప్రభు సన్నుతిచేయగ ||2||