Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
రండి రండి రండి కోటను చుట్టెదమూ
చుట్ట్టిన కోటను స్తుతుల శక్తితో కూల్చెదము ||2||
మొదటిరోజూ కాకపోని రెండవరోజు కాకపోని
మూడవరోజు కూలిపోవును స్తుతించి
స్తుతించి స్తుతులు శక్తితో కుప్పకూలును ||2|| llరండిll
1 వ చరణం..
ఎరికోని చుట్చిన ఇస్రాయేలుని చూడుడి
అందరు కలసి స్తుతియించగా కోట కూలిపోయెను
మరి మనము కూడా కలసి పాడెదమా-
కోటలను కూల్చెదము ||2|| llరండిll
2 వ చరణం..
చెఱశాలలోని పౌలుని చూడిడి
సిలాసుతో కలసి స్తుతించగా
చెఱశాలలు కూలిపోయెను
మరి మనం కూడా కలసి పాడెదమా
బంధకాలను తెంచెదమా ||2|| llరండిll
3 వ చరణం..
బాబియేలులో దానియేలుని చూడిడి
మిత్రులతో కలసి స్తుతియించగా
మర్మం బయలుపరచెదను
మరి మనం కూడా కలసి పాడెదమా-
అద్భుతాలను చూపెదమా llరll