Type Here to Get Search Results !

రండి యుత్సాహించి ( randi yusthahinchi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


(శంకరాభరణం ` ఆదితాళం) 

రండి యుత్సాహించి పాడుదము 

రక్షణ దుర్గము మన ప్రభువే 


1 వ చరణం.. 

రండి కృతజ్ఞత స్తోత్రముతో ` రారాజు సన్నిధి కేగుదము

సత్ప్రభు నామము కీర్తనలన్‌ 

సంతోష గానము చేయుదము llరండిll 


2 వ చరణం.. 

మన ప్రభువే మహా దేవుండు`ఘన మహాత్మ్యము గలరాజు 

భూమ్యాగాధపు లోయులను 

భూధర శిఖరము లాయనవే llరండిll 


3 వ చరణం.. 

సముద్రము సృష్టించె నాయనయే`సత్యుని హస్తమే భువిజేసెన్‌

ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొర్రెలము llరండిll 


4 వ చరణం.. 

ఆ ప్రభు సన్నిధి మోకరించి`ఆయన ముందర మ్రొక్కుదము 

ఆయన మాటలు గైకొనిన

నయ్యవిమన కెంతో మేలుగును llరండిll 


5వ చరణం.. 

తండ్రి కుమార శుద్ధాత్మకును`తగుస్తుతి మహిమలు కల్గుగాక 

ఆదిని నిప్పుడు నెల్లప్పుడు 

నయినట్లు యుగముల నౌనౌను ఆమెన్‌. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section