Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
రండి రండి విందుకు - కడరా విందుకు
ఆత్మీయులారా-ఆహ్వానితులారా ||2||
- వేగమే రారండి
1 వ చరణం..
యావే దేవుడు - ఇజ్రాయేులులను
వాగ్దానసీమకు - నడిపించువేళలో
మన్నా విందును-కురిపించి
నలుబది యేండ్లు - పోషించి ||2|| llరండిll
2 వ చరణం..
యేసు క్రీస్తువు రాజ్య స్థాపనలో
ఐదువేల మందికి - అద్భుత విందు ఇవ్వగ ||2||
సంతృప్తిగ భుజియించిరి -
దేవుని ప్రేమను శ్లాఘించిరిllరండిll
3 వ చరణం..
దివ్య ప్రసాదము - శ్రీ సభ హృదయంలో
పూజా పీఠముపై మందసమై
వెలుగొంద జీవన
ప్రభలను చిలికించి -
దైవజనులను నడిపించిllరండిll