Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: రండి యుత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే
1. రండి కృతజ్ఞత స్తోత్రముతో
రారాజు సన్నిధికేగుదము
సత్ప్రభు నామము కీర్తనలన్
సంతోష గానము చేయుదము
2. మన ప్రభువే మహాదేవుండు
ఘన మహాత్మ్యముగల రాజు
భూమ్యాగాధపు లోయలును
భూధర శిఖరములాయనవే
3. సముద్రము సృష్టించెనాయనదే
సత్యుని హస్తమే భువి జేసెన్.
ఆయన దైవము పాలితుల
మాయన మేపెడి గొట్టెలము
4 ఆ ప్రభు సన్నిధి మోకరించి
ఆయన ముందర మొక్కుదము
ఆయన మాటలు గైకొనిన
నయ్యది మనకెంతో మేలగును
5. తండ్రి కుమార శుద్దాత్మకును
తగు స్తుతి మహిమలు గలుగు గాక
ఆదిని నిప్పుడునెల్లప్పుడు
నయినట్లు యుగముల నౌను ఆమెన్.