Lyrics: Y Prabhakar Reddy
Tune: unknown
Music: Naveen M
Album: లాలనచు పాడరే - 6
ప: రావా రావా రావా యేసయ్యా
మా ఎదలో ఉదయించ రావా యేసయ్యా
మా మదిలో నివసింప రావా
యేసయ్యా ||2||
కో: యేసయ్యా చిన్ని-యేసయ్యా
యేసయ్యా బాల మెస్సయ్యా, ||2||
పుడమిపైన నరులందరు ఒక్కటే నని
నీదు చెంత చేరేందుకు అర్హులే నని ||2||
జ్ఞానులైన హీనులైన సమమేనని ||2||
నిన్ను చూడ జాడ తెలిపి కరుణించితివే ||2||
2. భేద భావమెరుగనట్టి నీదు బిడ్డలం
ప్రేమతో కలిసి బ్రతుకు సంఘ జీవులం ||2||
నిన్ను కొలువ చేయి కలిపి చెంతకొస్తిమి ||2||
చింతలన్ని బాపి మమ్ము కరుణ బ్రోవుము ||2||