Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
తల్లి ఒడిలో పవళించె బిడ్డవలె నే -
తండ్రి నీ ఒడిలోనే - ఒదిగితినయ్యా
1. వేదన లేదు శోధన లేదు -
నీ హస్తం విడువనయ్యా
భయమన్నది లేనే లేదు -
ప్రేమతో నడిపితివి -
నన్ను ప్రేమతో నడిపితివి
2. నీ ఉపకారం స్మరియించి -
స్తుతి స్తోత్రము తెలిపెదను
నే స్తుతి స్తోత్రము తెలిపెదను -
చెయ్యి విడువని నా యేసయ్యా
కల్వరి నాయకుడా -
నా కల్వరి నాయకుడా
3. మంచి కాపరి జీవ కాపరి -
మంచి కాపరి నా జీవకాపరి
హృదయ పాలకుడా -
నా హృదయ పాలకుడా
ఆహారమై వచ్చితివా -
ఆత్మతో కలిసితివా నా ఆత్మతో కలసితివా
4. నిన్ను నేను పట్టుకొంటిని -
భుజము పైన సోలెదను
నీ భుజము పైన సోలెదను
- నీ రెక్కల నీడలో నుండి
లోకాన్ని మరచితిని -
ఈ లోకాన్ని మరచితిని
5. రేయింపవలు వెదికానయ్యా
నీకై వేచితిని నే నీకై వేచితిని
నా జీవిత కాలమంతా నీ నామం చాటేదను -
నే నీనామం చాటెదను